జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి .
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాల
పెద్దలను గౌరవించి పూజించాలి .. పూజించాలి
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును .. సుఖాలు దక్కును
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు .. ఉండకూడదు
పవిత్రమైన ఆశయాన మరువకూడదు .. మరువకూడదు
గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా .. బ్రోవుము దేవా
కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా .. నడుపుము దేవా
బీదసాదలాదరించు బుద్ది నొసగుమా .. శక్తి నొసగుమా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా
గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు .. సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు … క్రుంగదీయకు
పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్…
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్.. పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ .. నిల్వబెట్టవోయ్
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా … జయమ్ము నిశ్చయమ్మురా… జయమ్ము నిశ్చయమ్మురా…
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.